మనకు స్పూర్తి కలిగించే వివిధ అంశాలు , వివిధ వ్యక్తుల గురించి ఈ శీర్షికలో చూద్దాము....

ప్రస్తుత సమాజములో రావణాసురుల కంటే శ్రీరామ చంద్రులే ఎక్కువ వున్నారు. అయినా మనము ఒకరిద్దరు చెడ్డవారిని చూసి భయపడతామే గానీ 98 మంది మంచి వారిని చూసి సంతోషపడం, వారిని ప్రోత్సహింఛం. బియ్యం, రాళ్ళూ కలసే వుంటాయి. మనము రాళ్ళు ఏరి బియ్యమే కదా ఉపయోగిస్తాం. చెడుని చూసి క్రుంగిపోవడం అందరూ చేసేదే గదా..మనము మంచిని చూసి పులకించి పోదాం. ఆ స్పూర్తి తోనే ముందుకుపోదాం. వారి చిరునామా అందుబాటులో వుంటే ఓ పోస్టు కార్డు ద్వారా మన 'కృతజ్ఞతలు' తెలుపుదాం.
 
ఇసుమంత ప్రతిఫలాన్ని ఆశించకుండా ఈ సమాజానికి సేవలను అందిస్తున్న మహానుభావులు ఎందరోవున్నారు. వారిని మనసారా అభినందిద్దాం. వారి నిస్వార్ధ సేవలకు చేతులెత్తి నమస్కరిద్దాం.(వివిధ పత్రికలు, ఎక్కువగా 'ఈనాడు' దినపత్రిక నుండి సేకరించిన వార్తలకు సంక్షిప్త వివరణను ఈ శీర్షికలో ఇవ్వడం జరుగుతుంది.)