నాకు నచ్చిన బ్లాగులు

దర్శనీయ స్థలాలు 

శలవు దినాలలో ఏదైనా దర్శనీయ స్థలాలకు మీరు వెళ్ళేందుకు సమాయత్తము కావచ్చు. అందుకు ముందుగా మనము ఒక ప్రణాళికతో సిద్దం అయితే మన యాత్ర ఎంతో హృద్యమంగా ముగుస్తుంది. అందుకు మీకు సహకరించేదే తమ్ముడు రాజాచంద్ర ఎంతో నిబద్దతతో నిర్వహిస్తున్న బ్లాగు 'తెలుగు ట్రావెల్ బ్లాగు' ఈ బ్లాగు ద్వారా మనము ఎన్నోవిషయాలు తెలిసికోవచ్చు..ఏ,ఏ, దర్శనీయ స్థలాలు ఎక్కడెక్కడ వున్నాయి... ఒకవేళ వెళితే ఎక్కడ బసచేసుకోవాలి, ప్రయాణము బస్సులోనా, రైల్లోనా..? అక్కడ దైవదర్శనానినికి స్థానికంగా అనుసరించవలసిన పద్దతులు, ఆ ఆలయానికి సంభందించిన అరుదైన ఫోటోలు... ఆఖరికి ఆక్కడి ఆటోవాలా తీసుకునే ఛార్జీలు (షుమారుగా).. మనకు సవివరముగా వివరించారు...