Clipart

* నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం శ్రమించేవాణ్ణి చూసి ఓటమి భయపడుతుంది. ... స్వామి వివేకానంద.. *

నిత్య చైతన్య స్పూర్తి  (ఈనాడు సౌజన్యంతో)

 

దూరం ఎంతైనా సంకల్పం ముందు చిన్నబోతుంది. లక్ష్యం ఎంతైనా ఆత్మవిశ్వాసం ముందు ఓడిపోతుంది. ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదల సత్సంకల్పం, దృఢ చిత్తం, చిత్తశుద్ది ఉంటే హిమాలయ సమున్నత తుల్య శిఖరాలను అధిరోహించవచ్చు. 
గొప్పగా పనులు చేయనక్కరలేదు. చేసే పనులు గొప్పగా చేస్తే అవే అక్కరకు వస్తాయి. పేదరికంలో ఉన్నప్పటికీ అది మన దరికి చేరకుండా పేదరికానికి ఎదురీది మనము ఏదరికైనా  చేరవచ్చని రుజువుచేస్తుంది.  చివరకు అదే పెద్దరికం అవుతుంది. నిజానికి నేను రచయితను కాను. కవిని అంతకన్నాకాను. చందోబద్దంగా అందంగా నేను వ్రాయలేను. ఎందరో గొప్పవారు ఎన్నెన్నో గొప్పవిషయాలు చెబుతున్నారు. . ఇంచుమించు అన్ని పత్రికలు వ్యక్తిత్వ వికాసానికి కొన్ని పేజీలు కేటాయిస్తున్నాయి. . అన్ని TV  చానల్స్ అనుభవజ్ఞుల  కధనాలను, వారి సందేశాలను  ప్రసారం చేస్తున్నాయి.   చెడుని ఖండించక పోవడం ఎంత తప్పో, మంచిని ప్రోత్సహించక పోవడం అంతే తప్పని నేను అనుకుంటాను.ఈ నేపధ్యమే ఈ బ్లాగు రచనకు ప్రేరణ.  నాకు తెలిసి నేటి యువత ప్రతి చిన్న అపజయానికి క్రుంగిపోయి ఆత్మహత్యకు తలపడుతున్నారు.  అదే యువత నెట్ ముందు కూర్చొని గంటలు, గంటలు గడుపుతున్నారు. నెట్ లో చెడు వున్నది, అంతకు మించి అదే  నెట్ లో  చాలా మంచి సమాచారం అందుబాటులో వుంది. మంచి అనేది ఎక్కడున్నా మనము తీసికోవాలి. అది నెట్ లో కావచ్చు, పత్రికలలో కావచ్చు, గొప్పవ్యక్తుల అంతరంగంనుండి కావచ్చు, లేక నా అనుభవ నైవేద్యమే కావచ్చు.....అది ఆరోగ్యం గురించి కావచ్చు, విద్య,ఉపాధులగురించి కావచ్చు, వ్యక్తిత్వ వికాసం గురించి కావచ్చు... మానసిక ఉల్లాసం గురించి కావచ్చు, లేదా మానవ నైజము గురించికావచ్చు....   ....  వాటన్నింటినీ ఓ మాలగా కూర్చి మీ ముందుంచడమే నా పని.  ఈ బ్లాగు వెనుకవున్న ఉద్దేశ్యము అదే.......అయినా  నేనేమీ నా స్వరచనలు ఇందులో వ్రాయబోవడం లేదు. ఎందరో రచయితలు, సమాజ శ్రేయోభిలాషులు చేసిన ప్రయత్నాన్ని సేకరించి ఒకచోటకు చేర్చే ప్రయత్నమే నాది.
 
సముద్రంలో ఎన్ని ఆణిముత్యాలున్నా సముద్రపు ఒడ్డున గులక రాళ్ళు ఏరుకునే అమాయకత్వం మనకు వద్దు. మన  ప్రయత్నంలో లోపం లేకుంటే ఆణిముత్యాలు అందుకోవటం సాధ్యమే అని నేను నమ్ముతున్నాను. ....మరి తప్పక మీ అభిప్రాయాలు నాతో పంచుకుంటారుగా ... నమస్తే... మీ వి.వి.ప్రతాప్.  
"మంచి మాటలు"
 
('ఈనాడు' డైలీ మరియు 'ఎందుకో ఏమో' బ్లాగరి గారికి కృతజ్ఞతలతో)
 
 

ఈ రోజు కష్టమే రేపటి నీ సుఖం Photobucket