30 కోట్ల విరాళము

'సొంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడుపడవోయ్' అంటారు, కానీ ఆయన తన సొంతమంతా పొరుగు వారే అనుకున్నారు. అందుకే వారికి సాయపడేందుకే తన జీవితాన్ని అంకితం చేశారు. 
 
తిరునల్వేలి జిల్లాలోని 'మలకరివేలంకులం' గ్రామంలో జన్మించారు
'శ్రీ కళ్యాణసుందరం'-  బాల్యంలోనే తండ్రి మరణించారు. సుందరానికి అమ్మా,నాన్న అన్నీ అమ్మే. వారి వూరిలో కరెంటు తో సహా ఎలాంటి సౌకర్యాలు లేవు. పాఠశాల కూడా వూరికి దూరంగా వుండటంతో పిల్లలందరూ షుమారు 10 కిలో మీటర్లు నడచి వెళ్ళేవారు.  బడికి వెళ్ళేముందు చిల్లర ఖర్చులకోసం సుందరానికి ఎంతో కొంత ఇంట్లో ఇస్తూ వుండేవారు. .. పుస్తకాలకు, దుస్తులకు money లేక చాలామంది పిల్లలు బడి మానేస్తూ వుండేవారు. సుందరానికి ఒక్కడే బడికి వెళ్ళటం ఆనందంగా వుండేది కాదు. అంచేత తన వద్ద వున్న money తో వారికి పుస్తకాలు, దుస్తులు కొనిపెట్టి తద్వారా వారందరూ  బడి కి రావడంతో ఎంతో ఆనందిచేవాడు మన చిన్న సుందరం. నాదగ్గర వున్నది ఇతరులకు ఇస్తే ఇంత ఆనందం కలుగుతుందా.. అనేది వారికి తెలిసింది ఇప్పుడే. 
సుందరం కాలేజీలో చదువునునే రోజుల్లో 'ఇండో చైనా యుద్దం జరుగుతున్న రోజులవి. ప్రజలందరూ ప్రభుత్వానికి సాయం చేయాలని నెహ్రూ గారు రేడియోలో ప్రసంగించారు. ఆ మాటలకు స్పందించి శ్రీ సుందరం అప్పుడే చన్నై వచ్చి ముఖ్యమంత్రి కామరాజు నాడార్ ని కలసి తన మెడలో వున్న బంగారు గొలుసు విరాళంగా ఇచ్చేశారు.
 
ఆ తరువాత ఓ కాలేజీ లో లైబ్రేరియన్ ఉద్యోగంలో చేరి వచ్చిన జీతంలో ఒక్క రూపాయి కూడా సొంత ఖర్చుకు ఉపయోగించకుండా పూర్తిగా పేదలకే ఉపయోగించాడు. ఉద్యోగ విరమణతో వచ్చిన 10 లక్షలను వివిధ సేవ కేంద్రాలకు విరాళంగా ఇచ్చేశారు. ఒక హోటల్ లో సర్వరు గా పనిచేస్తూ తన భోజన ఖర్చుకు కావాల్సింది సంపాదించుకునే వారు.
 
ఆయన సేవలను గుర్తించి కేంబ్రిడ్జి కి చెందిన ఇంటర్ నేషనల్ బయోగ్రాఫిక్ సెంటర్ సుందరం గారిని 'నోబ్లెస్ట్ ఆఫ్ ద వరల్డ్ గా సన్మానించి 30 కోట్లు బహుమతిగా ఇచ్చింది. దానిని కూడా వివిధ సేవాసంస్థలకు విరాళంగా ఇచ్చేశారు. 
 
శ్రీ సుందరం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.
(2 జూన్ 2013 ఈనాడు దినపత్రిక  ఆదివారం అనుబంధం నుండి సేకరణ)