పేదవిద్యార్ధులకు విద్యాదానం

దొరలు దోచలేరు, దొంగలెత్తుకు పోరు, అందుకే విధ్యాధనం గొప్పది, విద్యాదానమూ గొప్పది. అలాంటి విద్యాధనాన్ని ప్రతిభావంతులైన పెదవిద్యార్ధులకు ఇవ్వ సంకల్పించింది హైదరాబాదులోని 'వృషామణి' ఫౌండేషన్ 
 
 
యెర్నేని జగన్మోహనరావు గారు కృష్ణాజిల్లా అంగలూరులో జన్మించారు. వీరు దాదాపు 20 సంవత్సరాలు ఆటోమోబైల్ పరిశ్రమను నిర్వహించారు. స్వగ్రామానికి తన వంతుగా ఏదైనా చేయాలనుకుని అనేక సేవాకార్యక్రమాలు చేపట్టారు. వారి స్ఫూర్తితో వారి కుమారుడు శ్రీ చక్రధర్ తన నాయనమ్మ 'వృషామణి' పేరుతో 2007 లో హైదరాబాదులోని మధురానగర్ ఈ ఫౌండేషన్ స్టాపించారు.
 
(ఫోన్: 9391033732  ,  040-23732408)  
-
 
ప్రతిభావంతులైన పేదవిధ్యార్ధులను  గుర్తించి .. వారికి నాయకత్వ లక్షణాలతో  పాటు అనేక జీవన నైపుణ్యాలను నేర్పటంతోపాటు వారిని తిరిగి ఈ సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తీర్చి దిద్దుతున్న 'వృషామణి' వ్యవస్తాపకులు శ్రీ యెర్నేని జగన్మోహనరావు గారికి, వారి కుమారులు శ్రీ చక్రధర్ గారికి నమఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేద్దామ్. వారికి సంపూర్ణ ఆయురారోగ్యములు ఇవ్వమని ఆ దేవుని కోరుకుందాం. నమస్తే .. మీ వి.వి.ప్రతాప్ 
 
(9 జూన్ 2013 ఈనాడు ఆదివారం అనుబంధం నుండి.. మాతృక రచయిత శ్రీ సురకంటి రాజేందర్)