దివ్యదిశ

' అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో మార్కులు రాలేదనో, హోమ్ వర్క్ చేయలేదనో... అనేకానేక కారణాలతో ఇల్లొదిలి వచ్చే పిల్లలకు 'దివ్య దిశ' స్వచ్చంద సంస్థ తన అక్కున చేర్చుకుంటోంది.' 
 
   రకరకాల కారణాలతో ఎంతోమంది పిల్లలు నగరాలకు ముఖ్యంగా హైదరాబాదుకి చేరుకుంటారు.ఏదో రైల్వే స్టేషన్లో రైలు దిగుతారు. ఎక్కడికి వెళ్లలో తెలియదు. ఎవర్ని పలకరించాలో తెలియదు. బిక్కమొహం వేసుకుని దిక్కులు చూస్తుంటారు. పిల్లల జీవితాలతో వ్యాపారం చేసుకునే దుర్మార్గులు అక్కడే కాచుకుని వుంటారు.వల విసరడానికి సిద్దమవుతారు. 'దివ్య దిశ' ప్రతినిధులు ఆ చుట్టుప్రక్కల వున్న మనసున్న వారు ఈ ఘోరం జరగనివ్వరు. ఇతరులైతే వెంటనే 'దివ్యదిశ' కార్యాలయానికి కాల్ చేసి (9848186982) విషయం చేరవేస్తారు. దివ్య దిశ ప్రతినిధులు గమనిస్తే వారికి నచ్చజెప్పి వారితో తీసుకుని వెళ్ళి, స్నానం చేయించి, మంచి దుస్తులు కట్టబెట్టి, భోజనం పెట్టి ఓదార్పు మాటల్థో వివరాలు సేకరించి అవకాశం వున్నంతవరకు వారి తల్లి తండ్రులకు అప్పగిస్తారు. అనాధలైతే అక్కున చేర్చుకుని విద్యాబుద్దులు నేర్పిస్తారు.
 
 
ఈ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ ఎసిడోర్ ఫిలిప్స్.. వారి అమ్మా,నాన్న గార్ల స్పూర్తి తో అనాధ పిల్లలకోసం, దారితప్పి వచ్చిన పిల్లలకోసం ఈ సంస్థను స్టాపించి మనసున్న మారాజుల ఆర్ధిక సహాయంతో నడుపుతున్నారు.
 
 ఇప్పటికి షుమారు 10 లక్షలకు పైగా బాలాల జీవితాలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేయగలిగామనే సంతృప్తితో వున్నారు. రోజు రోజుకీ గడప దాటుతున్న పిల్లల సంఖ్య పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు.
 
ఫిలిప్స్ గారిని మనసారా అభినందిద్దాం. వారికి కాల్ చేసి మరింతగా ప్రోత్సహిద్దాం. కుదిరితే మనవంతు సహాయంగా కాస్త money పంపుదామ్.
( 20 మార్చ్ 2011 ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధం  నుండి సేకరించడమైనది)