(సరదాగా) మీ జాతకం/ మీ మానసిక స్థితి/

ఒకొక్కసారి మనము ఏదో తెలియని ఆందోళనకు గురి అవుతాము. మన సమస్యను ఏ ఒక్కరితో పంచుకోలేని సందిగ్ధంలో వుంటాము. ఏ ఒక్క ఓదార్పు అయినా వస్తే బాగుంటుందని ఆశిస్తాము. మనము చేసిన పని సరైనదా.. కాదా .... కాకుంటే ఎలా చేస్తే బాగుండేది? ఒకవేళ సరైనదే అయితే మనము ఆశించిన ఫలితము వస్తుందా రాదా.... ఇలాంటి మానసిక సంఘర్షణలో వున్నప్పుడు మన జాతకము ఒకసారి చూయించుకుంటే బాగుంటుందేమో అనే నిర్ణయానికి వస్తాము. దానిని ఆ సో కాల్డు జ్యోతిష్కులు కాష్ చేసికుని ఆ దోషం పోవాలంటే ఇది చేయాలి, ఈ దోషం పోవాలంటే అది చేయాలని మనకు లేనిపోని క్రొత్త సమస్యలు సృష్టిస్తారు. మీకు ఎప్పుడైనా ఈ స్థితి వస్తే 'ఉద్యోగసోపానం' వారి ప్రచురణ 'నిత్యస్ఫూర్తి' చదవండి. మనసెంతో హాయిగా ... మన సమస్యకు పరిష్కారము దొరికినట్లే వుంటుంది. ఇక్కడ జరిగినది ఆ ప్రయత్నమే. మీరు చదవబోయేది ఆ పుస్తకములోని మాటలే...  ముందుగా మీ మానసిక సంఘర్షణ గురించి ఒక పరి ఆలోచించి మీ మనసులో ఒక అంకె 1 నుండి 50 వరకు అనుకుని ఆ సంఖ్య ఎదురుగా వున్న  వాక్యముపై కర్సర్ వుంచి మీ మౌస్ తో డ్రాగ్ చేయండి. ఇలా మిమ్మల్ని మీరు సమాధాన పరచుకునే వరకు ఎన్ని సార్లైన చేయండి. ఒక నిర్ణయానికి వచ్చేక ఇక వెనుదిరిగి చూడకుండా ముందుకు అడుగు వేయండి. మీకు మీరే దేవుడు. అన్నీ మీలోనే వున్నాయి. మీ స్థితికి మీరే కర్త,కర్మ,క్రియా... ఒకేనా మిత్రమా... మీ ప్రతాప్ 
 
 1. అది అంత పట్టించుకోవలసిన విషయం కాదు. 
 2. జరిగింది ముమ్మాటికీ మీ మంచికే 
 3. మీకాపనిచేయగల సామర్ధ్యం ఉన్నది.
 4. మీకు మరోమంచి అవకాశం వచ్చి తీరుతుంది.
 5. అనవసర విషయానికి మీరు వ్యధ చెందుతున్నారు 
 6. మీలో విజయము సాధించేందుకు కావలసిన లక్షణాలు అన్నీ వున్నాయి. 
 7. ఆ పరిస్థితుల్లో అదే సరైన నిర్ణయం 
 8. ఇకపై అంతా శుభమే జరుగుతుంది.
 9. కాస్త ఆలస్యమైనా మీరు కోరుకున్నది మీకు దక్కుతుంది.
 10. ఆ పని జరగదని ముందే అనుకోవడమెండుకు?
 11. ఇప్పటికి నిగ్రహం వహించడమే మంచిది. 
 12. మీ అనుమానము నిజముకాదని మీకూ తెలుసు 
 13. మీరు మంచి పనికోసం శుభశకునాలు వెతకరు.
 14. మీరు మరొకరి మాటలకు బెదిరే మనిషి కారు 
 15. ఆ తప్పు మీదేనేమో... మరొకరిని ఆడిపోసుకోవడం ఎందుకు?
 16. త్వరలోనే మీ వ్యధలన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి.... 
 17. అతి జాగ్రత్త అనిపించినా మీ వైఖరి మంచిదే....
 18. పదేపదే ఆ విషయాన్ని గుర్తుకుతెచ్చుకోవడం అనవసరం.
 19. త్వరలో అపోహలన్నీ తొలగిపోతాయి.
 20. మీకు మరో మంచి అవకాశము వచ్చి తీరుతుంది.
 21. మీకు ఆ పని చేయగల సామర్ధ్యము వున్నది.
 22. ఎప్పుడూ మీమాటే చెల్లుబాటుకావాలని అనుకోకూడదు.
 23. ఎదుటివారు మీలాగానే ఎలా ఆలోచిస్తారు?
 24. మీకు ఏది మంచిది అనిపిస్తే అదే చేయండి.
 25. అది అంత పట్టించుకోవలసిన విషయంకాదు..
 26. వెంటనే కాకపోయినా మీరు కోరుకున్నది జరుగుతుంది
 27. మీరాపని కావాలని చేయలేదు.. మరిఎందుకు ఆ చింత?
 28. మీ ఆలోచన మంచిదే ... విజయము సాధించగలరు.
 29. లక్ష్యసాధనకు మీరు ఎంచుకున్న మార్గం సరైనదే...
 30. పొరపాట్లను సరిదిద్దుకోగల సామర్ధ్యము మీలో వున్నది.
 31. ఎదుటి వ్యక్తిలో మంచిలక్షణాన్నే మీరు గుర్తిస్తారు.
 32. మీరు ఆయాచితంగా విజయాలను కోరుకునే మనిషికాదు.
 33. మీ ఆత్మీయులకు మీరంటే ఎప్పుడూ అభిమానమే....
 34. మీరు అనవసర విషయాలకు రాద్ధాంతం చేసే మనిషి కారు.
 35. కొత్త దారిలో నడిచేందుకు మీరు భయపడే మనిషి కారు.
 36. మీరు తలచుకుంటే ఆ పని చేయగలరు.
 37. నిన్నటిసంగతి ఎందుకు.. ఈరోజునుండి మీకు బాగుంటుంది.
 38. ప్రయత్నమంటూ చేస్తే ఫలితం తప్పకుండా దక్కుతుంది...
 39. మరోలా జరుగుతుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు?
 40. ఆదుర్దా ఎందుకు? ప్రశాంతంగానే ముందుకు వెళ్ళండి.
 41. నలుగురూ మిమ్మల్ని  మెచ్చుకునేరోజు దగ్గరలోనేవున్నది.
 42. మీ నిరాశ త్వరలోనే తొలగిపోతుంది.
 43. మీకు కావలసింది దొరికి తీరుతుంది. 
 44. మీ చింతలన్నీ తీరేరోజు దగ్గరలోనే వుంది.
 45. పరులను నిందించడము ఎందుకు.. లోపం మనలోనే వున్నదేమో!
 46. వాయిదా మనస్తత్వం వదులుకుంటే మీరెన్నో సాధించగలరు
 47. ప్రస్తుతము మీ ఆందోళన ఎక్కువకాలం వుండదు...
 48. కోతుకున్నవన్నీ దొరకవు. శ్రమించి సాధించుకోవాలి.
 49. తప్పేమీలేదు.. మీ ఆలోచన మంచిదే...
 50. వాయిదా మనస్తత్వం వదులుకుంటే మీరెన్నో సాధించగలరు